NTV Telugu Site icon

Holi Colours: హోలీ రోజున కళ్లు, నోటిలోకి రంగులు పోతే ఏం చేయాలి..?

Holi 3

Holi 3

రంగుల పండుగ హోలీ రంగుల ఆనందాన్ని తెస్తుంది. హోలీని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే రంగులు అనుకోకుండా కళ్ళు, చెవులల్లో పడుతుంది. ఆ తర్వాత నోటిలోకి వెళ్తుంది. ఈ రంగుల్లో కలిపిన రసాయనాల వల్ల హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకే హోలీ ఆడే సమయంలో చెవులు, కళ్లు, నోటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొరపాటున నోటిలోకి రంగు చేరితే ఎలాంటి వ్యాధులు వస్తాయనే ప్రశ్నలు ప్రజలలో తలెత్తుతుంది. శరీర భాగాలలో రంగులు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అందుకు సంబంధించి కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందాం.

Arvind Kejriwal: అరెస్ట్‌లో కేజ్రీవాల్ రికార్డ్.. ఫస్ట్ సిట్టింగ్ సీఎం ఇతనే..

హోలీ రంగులు నోటిలోకి వెళ్తే ఏమవుతుంది..?
హోలీ రంగులలో ఎక్కువగా రసాయనాలు కలిసి ఉంటాయి. ఇది పొరపాటున నోటి ద్వారా కడుపులోకి వెళ్తే.. వాంతులు, విరేచనాలు చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా.. నోరు మొత్తం చప్పబడిపోతుంది. హోలీ ఆడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.. లేదంటే వేలిగోర్ల నుంచి కెమికల్స్ శరీరంలోకి వెళ్తాయి. అందుకే హోలీ ఆడిన తర్వాత.. ఒకటికి రెండుసార్లు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

కళ్లలోకి వెళ్తే..
కళ్లలో హోలీ రంగులు వెళ్తే మంట లేదా దురద వంటి సమస్యలు రావచ్చు. రంగులను ఆకర్షణీయంగా చేయడానికి రసాయనాలు లేదా అనేక ఇతర వస్తువులతో తయారు చేస్తారు. అంతేకాకుండా.. హోలీ ఆడుతున్నప్పుడు చాలా మంది పొరపాటున కళ్లలోకి చల్లుతారు. ఇలా కళ్లకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే రంగు పడిన వెంటనే కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మంటగా అనిపిస్తే.. రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ ద్వారా కళ్లు చల్లదనంగా ఉంటాయి. కళ్లలో రంగు ఉన్నట్లైతే .. పొరపాటున కూడా రుద్దవద్దు. అలా చేస్తే దురద, మంట పెరుగుతుంది.

హోలీ రంగులు చెవుల్లోకి చేరితే ఏమి చేయాలి?
హోలీ రంగులు చెవుల్లోకి చేరితే ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హోలీ ఆడుతున్నప్పుడు పొరపాటున పొడి రంగు చెవిలోకి వెళితే.. వెంటనే గట్టిగా కిందకు తుడవాలి. చెవిలో రంగు అలాగే ఉంటే.. ఇయర్‌బడ్‌లతో శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తేనే.. చెవిలో నొప్పి, మంట రాకుండా ఉంటుంది. ఒకవేళ రంగులు చెవిలో అలాగే ఉన్నట్లైతే.. అప్పుడు డాక్టర్ ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.