* తిరుమల: ఇవాళ అక్టోబర్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను విడుదల చెయ్యనున్న టీటీడీ.. తిరుమల, తిరుపతితో పాటు తలకోనకు సంబంధించి వసతి గదుల కోటా విడుదల
* నంద్యాల: నేడు ఆత్మకూరులో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
* పల్నాడు: నేడు అమరావతి మండలం మునుగోడులో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు
* నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి మీడియా సమావేశం
* నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా: చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామం నందు జరుగు జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి తానేటి వనిత
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. రాజమండ్రి రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే బీజేపీ జోనల్ సమావేశానికి హాజరు కానున్న పురంధేశ్వరి
* నిజమాబాద్ జిల్లా: నేటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 60 వసంతాలు.. 60 వసంతల వేడుకల్లో భాగంగా ప్రాజెక్టు వద్ద 10 గంటలకు జలహారతి ఇవ్వనున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు నుండి ఖరీఫ్ పంటలకు నేటి నుండి సాగు నీటి విడుదల.. కాకతీయ కాలువ ద్వారా ఎల్ఎమ్‌డీకి నీటిని విడుదల చేయనున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
* విజయనగరం: నేడు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం.. మండలి అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరగనున్న సమావేశం