Site icon NTV Telugu

Cash Limit at Home : మీ ఇంట్లో ఎన్ని కట్టల డబ్బులు ఉంచుకోవచ్చో తెలుసా ?

New Project (31)

New Project (31)

Cash Limit at Home : దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించేశారు. కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదు అవసరం అవుతుంది. ఎందుకంటే అత్యవసర సమయాల్లో ప్రజలు నగదుపైనే ఎక్కువగా ఆధారపడతారు. అందుకే ప్రజలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంట్లో నగదు ఉంచడానికి ఇష్టపడతారు. అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చో తెలుసా? ఇంట్లో నగదు ఉంచుకోవడానికి పరిమితి ఎంత? పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుంది? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే మీ వద్ద అందుబాటులో ఉన్న నగదుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కలిగి ఉండాలి. ఆ డబ్బు మీకు ఎక్కడ నుండి వచ్చింది, దాని ఆదాయ వనరు ఏమిటి? అన్న వాటికి రుజువులు ఉండాలి. మీ వద్ద పెద్ద మొత్తంలో నగదు అందుబాటులో ఉంటే, మీరు దానిపై పన్ను చెల్లించాలి. దీనితో పాటు మీరు పన్ను చెల్లింపుకు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలి. తద్వారా మీరు ఆదాయపు పన్ను శాఖకు వారి నగదుకు సంబంధించిన ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వవచ్చు.

Read Also:ED: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు..

ఆదాయపు పన్ను శాఖ మీ ఇంటిపై దాడులు చేసి, పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయబడి, ఆ నగదు గురించి సరైన సమాచారం ఇవ్వలేకపోతే, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఈ జరిమానా మొత్తం దాడిలో స్వాధీనం చేసుకున్న మొత్తంలో 137 శాతం వరకు ఉంటుంది.

ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఇవీ నియమాలు
* ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలపై జరిమానా విధించవచ్చు.
* CBDT ప్రకారం, మీరు ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా పాన్ నంబర్‌ను అందించడం అవసరం.
* ఒక వ్యక్తి ఏడాదిలో రూ. 20 లక్షల నగదు డిపాజిట్ చేస్తే, అతను పాన్, ఆధార్ రెండింటి సమాచారాన్ని అందించాలి.
* పాన్, ఆధార్ వివరాలను అందించడంలో విఫలమైతే రూ. 20 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
* 2 లక్షల కంటే ఎక్కువ నగదు కొనుగోళ్లకు పాన్, ఆధార్ కార్డ్ కాపీ అవసరం కావచ్చు.
* రూ. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదు ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం లాంటివి చేస్తే ఎవరైనా దర్యాప్తు సంస్థ రాడార్ కిందకు రావచ్చు.
* బంధువుల నుంచి ఒక్కరోజులో రూ.2 లక్షలకు మించి నగదు తీసుకోలేరు.

Read Also:BYD: టెస్లాను అధిగమించిన చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ బీవైడీ..

Exit mobile version