NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే..?

Kalki

Kalki

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు.

Read Also :Chiranjeevi : ‘విశ్వంభర’ సెట్స్ కు వి.వి.వినాయక్..

అద్భుతమైన విజువల్స్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ క్రేజ్ వుంది.ఈ సినిమా ఫస్ట్ కలెక్షన్ టార్గెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమా మొదటి రోజు 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అలాగే రాజమౌళి తదుపరి చిత్రం అయిన ‘ఆర్ఆర్ఆర్ ’ కూడా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. కానీ ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ఆ మార్క్‌ను ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన సలార్ కూడా ఆ మార్క్ ను టచ్ చేయలేకపోయింది.దీనితో ప్రభాస్ కల్కి ఫస్ట్ డే టార్గెట్ 200 కోట్లు అని తెలుస్తుంది.ఈ మార్క్ కనుక కల్కి క్రాస్ చేస్తే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం సృష్టిస్తుంది అనటానికి ఎలాంటి సందేహం లేదు. అలాగే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్ రేట్స్ కూడా పెంచడంతో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం వుంది.