NTV Telugu Site icon

Mononucleosis : లవర్‎కు లిప్ కిస్ ఇస్తున్నారా.. జాగ్రత్త ?

New Project (10)

New Project (10)

Mononucleosis : మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా.. ? తను ముద్దు ఇచ్చేందుకు నిరాకరించినా మీరు కావాలని ఫోర్స్ చేస్తున్నారా ? తను ముద్దు ఇచ్చేందుకు ఒప్పుకునేలా చేస్తున్నారా? ఒక ఆమె వద్ద నుంచి మీరు కిస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారా? అయితే వన్ సెకన్! కాస్త ఆగి ఆలోచించే టైం లేకున్నా నేను చెప్పేంది వింటే మీరు జీవితంలో ముద్దే వద్దంటారు. నేను చెప్పేది వింటే షాక్‌ లో ఉండిపోతారు. కిస్‌ డిసీజ్ గురించి మీకు తెలుసా? దీని గురించి తెలుసుకుని అప్పుడు కిస్‌ ఇవ్వడమో, తీసుకోవడమో చేయండి. ఈ వ్యాధి గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందువల్లే దీని బారిన ఎంతో మంది పడుతున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకుంటే.. దీని నుంచి దూరంగా ఉండొచ్చు.

Read Also: Heat wave Forecast: మేలో నిప్పుల కొలిమి.. ఆ రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

మోనోన్యూక్లియోసిస్ అనే వ్యాధినే కిస్సింగ్ డిసీజ్ (ముద్దు వ్యాధి) అని అంటారు. ఇది ఎస్ప్టీనన్ బార్ వైరస్ వల్ల వస్తుంది. లాలాజలం(ఉమ్ము) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇది ఒకరిని ఒకరు ముద్దులు పెట్టుకుంటే వస్తుంది. అందుకే దీనికి ముద్దు వ్యాధి అనే పేరు వచ్చింది. అయితే ఇది ఉన్నవారి వస్తువులను తాకినా వారు తాగిన గ్లాస్, ఆహార పదార్థాలను వాడినా ఈ వైరస్ మీకు సోకుతుంది. అయితే ఈ వ్యాధి సాధారణ జలుబు మాదిరిగా అంటువ్యాధి అయితే కాదని నిపుణులు అంటున్నారు.

Read Also: Vellampalli Srinivas: ఎంతమంది రజనీకాంత్‌లు వచ్చినా ప్రజలు నమ్మరు..

నిజం చెప్పాలంటే ఈ వ్యాధి అంత ప్రమాదకరమైంది కాదు. తీవ్రమైన అనారోగ్యమూ కాదు. కానీ మీకు కొన్ని సమస్యలు కలగొచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో గొంతునొప్పి, అలసట, జ్వరం, మెడ,చంకలలో శోషరస కణుపుల వాపు, చర్మంపై దద్దుర్లు, టాన్సిల్స్, తలనొప్పి లక్షణాలు వస్తాయి. నిపుణుల ప్రకారం.. ఈ వ్యాధి పిల్లలలో పాటుగా యుక్తవయసు వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే చిన్న పిల్లలకు ఈ వ్యాధి ఉన్నట్టు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ టీనేజర్లు, 20 ఏండ్లు ఉన్నవారికి తీవ్రమైన మోనో లక్షణాలు కనిపిస్తాయి. ఏదేమైనా వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ముద్దు వ్యాధి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. మందులను వాడండి. అలాగే ఎక్కువ విశ్రాంతి తీసుకోండి.