Site icon NTV Telugu

Bubonic Plague: 14వ శతాబ్ధంలో లక్షల మందిని బలిగొన్న వ్యాధి.. తాజాగా అమెరికాలో వెలుగులోకి..

Bubonic Plague

Bubonic Plague

Bubonic Plague: 14వ శతాబ్ధంలో ప్రపంచాన్ని భయపెట్టిన, దాదాపుగా ఐరోపాలో 10 లక్షల మంది ప్రాణాలను తీసుకున్న ‘‘బుబోనిక్ ప్లేగు’’ అమెరికాలో గుర్తించారు. యూఎస్ ఓరేగాన్‌లో ఓ వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించారు. డెస్చుట్స్ కౌంటీలో రోగికి పెంపుడు పిల్లి ద్వారా ఈ వ్యాధి సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పిల్లికి, రోగికి మధ్య కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించామని, అనారోగ్యాన్ని నివారించడానికి మెడికేషన్ ఇచ్చామని ఆ ప్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ రిచర్డ్ ఫాసెట్ ఒక ప్రకటనలో చెప్పారు.

ప్రస్తుతం వ్యాధి సోకిన వ్యక్తికి ప్రారంభ దశలోనే ఉన్నాడని, అతను తన సన్నిహితులకు ప్రమాదం అంచుకు తీసుకువచ్చాని వైద్యులు తెలిపారు. కొన్ని శతాబ్ధాల కింద లక్షలాది మరణాలకు కారణమైన ఈ వ్యాధి ప్రస్తుత కాలంలో కనిపించడం చాలా అరుదు. ఆ రోజుల్లో వ్యాధికి చికిత్స, పవర్ ఫుల్ యాంటీ బయాటిక్స్ లేకపోవడంతో చాలా మంది ప్రజలు మరణించారు. ప్లేగును కలిగించే బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. దీంతో దీన్ని పూర్తిగా తొలగించలేకపోవడానికి కారణమని వైద్యులు చెబుతున్నారు.

Read Also: Jobs: భారతీయులకు గుడ్‌న్యూస్.. సౌదీలో భారీగా ఉద్యోగాలు.. జీతమెంతంటే..!

ఈ వ్యాధి 5 కోట్ల మందిని బలితీసుకుంది. ఎక్కువగా యూరప్ ప్రభావితమైంది. మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. చరిత్రలోనే అత్యంత ఘోరమైన మహమ్మారిగా ‘ప్లేగు’కి పేరుంది. దీనిని బ్లాక్ డెత్‌గా పిలుస్తారు. ఇది ‘యెర్సినాయి పెస్టిస్’ అనే బ్యాక్టీరియా కారణంగా ప్లేగు వ్యాధి సంభవిస్తుంటుంది. దీనికి జంతువులు, మానవులు ప్రభావితమవుతారు. ఈగల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన జంతువు చనిపోయిన సందర్భంలో దాని అంతర్గత స్రావాలకు మానవుడు లేదా ఇతర ఏదైనా జంతువు కాంటాక్ట్ అయితే వ్యాధి సోకే అవకాశం ఉంది.

బుబోనిక్ ప్లేగు లక్షణాలు:

1. ఆకస్మికంగా అధిక జ్వరం మరియు చలి

2. చేతులు, కాళ్లు మరియు పొత్తికడుపులో నొప్పి.

3. తలనొప్పి

4. లింప్ నోడ్స్ వద్ద పెద్ద వాపు గడ్డలు అభివృద్ధి చెందుతాయి, వాటి నుంచి చీము కారుతుంది.

5. తీవ్రమైన సందర్భాల్లో, గ్యాంగ్రేన్ కారణంగా కణజాలం నల్లగా మారుతుంది, తరచుగా వేళ్లు లేదా కాలిపై ప్రభావం చూపుతుంది లేదా అసాధారణ రక్తస్రావం కావచ్చు.

Exit mobile version