మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అని వార్తలు వెలువడడంతో ముమ్మాట్టి అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలు నిజమేనని తెలిశాయి. ముమ్మాట్టి అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్స్ కూడా బ్రేక్ ఇచ్చేసి చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్నారు.
Also Read : Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు
ఇదిలా ఉండగా ముమ్మాట్టి అనారోగ్యం పాలైనపుడు మోహన్‌లాల్ శబరిమలలో ప్రత్యేక పూజలు చేసారు. ఆరోగ్య సమస్యలు అందరికీ వస్తాయు. ముమ్మాట్టి త్వరగా కోలుకుని తిరిగి వస్తాడన్నారు. తాజాగా ముమ్మట్టి ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ లవ్ సింబల్ జతచేస్తూ పోస్ట్ చేసారు. ఇక మమ్ముట్టి వ్యక్తిగత మేకప్ మ్యాన్ జార్జ్ తెలియజెస్తూ మమ్ముక్క కోలుకున్నారు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు తాజాగా జరిపిన వైద్య పరీక్షల ఫలితాలు అన్ని నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మీ అందరి ప్రార్థన వల్ల ఆయన రికవరీ అయ్యారు. చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్న మమ్మూట్టి ఓనం లేదా సెప్టెంబర్ ప్రారంభంలో కేరళలో ఉంటారు. కానీ ముమ్మట్టి ఏ సమస్యతో బాధపడుతున్నారో చెప్పలేదు. నటి మంజు వారియర్ ఇన్‌స్టాలో ‘వెల్‌కమ్ బ్యాక్ టైగర్’ అని మమ్ముక్క ఫోటోను షేర్ చేసారు. ముమ్మాట్టి రాగానే ప్రస్తుతం జితిన్ దర్శకత్వంలో ‘కళంకావల్’ సినిమా డబ్బింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఆ తర్వాత, సెప్టెంబర్ లోనే పేట్రియాట్ సినిమా లండన్ షెడ్యూల్‌లో పాల్గొంటారట.ఇక తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా కేరళ వస్తున్నాడని తెలిసి అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో పోస్ట్ లు పెడుతున్నారు. సెప్టెంబర్ 7న ముమ్మట్టి బర్త్ డే కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
