NTV Telugu Site icon

Aadhaar Of Dead Person: మరణించిన వ్యక్తి ఆధార్ ఏమవుతుందో తెలుసా..

Aadhaar Of Dead Person

Aadhaar Of Dead Person

భారతీయ పౌరులకు ఆధార్ ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారిపోయింది. 12 అంకెల నిర్దిష్ట సంఖ్యను కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం అన్ని పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ ఆధార్ కార్డులో మన పేరు, చిరునామా, వేలిముద్ర, అలాగే ఐరిస్ లాంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని పొందుపరిచి ఉంటుంది. ప్రభుత్వ సామాజిక భద్రత ప్రయోజనాల కొరకు దరఖాస్తు చేయడం లాంటి విషయాల నుండి అలాగే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చేసేంతవరకు ఇలా ప్రతి దానిలో ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. పుట్టిన పిల్లలనుండి ఈ ఆధార్ కార్డును పొందవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఆధార్ కార్డు ఉపయోగించి ఆన్లైన్ మోసాలు ఎక్కువ అయిపోయాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి చనిపోతే వారి ఆధార్ కార్డు ఏమవుతుందనే ఆలోచన మీకు కచ్చితంగా వచ్చే ఉంటుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం.

Manish Sisodia: హైకోర్టులో చుక్కెదురు.. సిసోడియా బెయిల్ పిటిషన్ కొట్టివేత

ముందుగా ఆధార్ కార్డును జారీ చేసే ప్రక్రియను UIDAI రూపొందించింది. దీని ద్వారానే ఆధార్ కార్డు జారీ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా క్యాన్సిల్ చేసే వెసులుబాటు అందుబాటులో మాత్రం లేదు. కాకపోతే దీని భద్రత కొరకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేసింది UIDAI. ముఖ్యంగా ఇలాంటి ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా క్యాన్సల్ చేయడం లాంటివి లేకపోవడం ద్వారా దానిని లాక్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా సదరు ఆధార్ కార్డు డేటాను వేరే వారు ఎవ్వరు యాక్సిస్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఆధారం ఉపయోగించాలంటే కచ్చితంగా దాన్ని అన్లాక్ చేసి ఉపయోగించాల్సిందే. కాకపోతే ఈ అవకాశం కేవలం మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మనం ఆధార్ కార్డును ఎలా లాక్ చేయాలన్న విషయాన్ని వస్తే..

US: జార్జియాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి

ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in ను ఓపెన్ చేసి., My Aadhaar ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘మై ఆధార్‌’ లోని Aadhaar Services క్లిక్ చేయాలి. అక్కడి ఆప్షన్లలో ‘Lock/Unlock Aadhaar Biometrics ‘ ఆప్షన్​ ను ఎంచుకోవాలి. దాంతో ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అవ్వడానికి, మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ ను నమోదు చేయాలి. ఆ తర్వాత ‘Send OTP ‘ పై క్లిక్ చేయాలి. దాంతో ఫోన్​కు వచ్చిన ఆ OTP ని నమోదు చేయాలి. అక్కడ దాంతో Lock/Unlock Biometric Data అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కావలసిన దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇక అంతే.. మరణించిన వ్యక్తి ఆధార్​ బయోమెట్రిక్స్ ​ను లాక్​ చేసుకుంటే సరిపోతుంది.