NTV Telugu Site icon

CPM: కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన సీపీఎం నేతలు.. ఏం అన్నారంటే..!

Cpi

Cpi

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సీఈసీ బృందం సమీక్షించనుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో భేటీ కానున్నారు.

Read Also: Revanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు. గత ఎన్నికల్లో బూత్ ఎన్నుకోడానికి ఇబ్బంది అయ్యిందని సీపీఎం నేతలు వారికి తెలిపారు. అంతేకాకుండా.. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. ఓటర్లకి డబ్బు అందిన తరువాతే ఓటు వేశారని అన్నారు. ఆన్లైన్ లో ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం లేదని.. మూడు రోజుల ముందు వరకు అవకాశం కల్పించాలని కోరారు. పోలింగ్ సెంటర్ లో 1000 మంది ఉండకుండా చూడాలని చెప్పామన్నారు. అంతేకాకుండా.. ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయాలని కోరినట్లు సీపీఐ నేతలు తెలిపారు. గత ఎన్నికల్లో వందల కోట్ల దొరికాయని.. వాటిపై ఎలాంటి శిక్ష వేశారో చెప్పాలన్నారు. హైదరాబాద్ 59 శాతం పోలింగ్ అవ్వడానికి కారణం.. బూత్ దొరకకనేనని సీపీఐ నేతలు పేర్కొన్నారు.

Read Also: Delhi Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం