MP Nandigam Suresh: ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సభను నిర్వహించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గతంలో చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడని ప్రశ్నించారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే చంద్రబాబు అడ్డుకుని కేసులు పెట్టారని ఆరోపించారు. అదే విధంగా చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి.. గెలిచిన తర్వాత ఆ ఊసే లేదన్నారు.
Read Also: Ukraine War: యుద్ధంలో రష్యా తరుపున పోరాడేందుకు క్రిమినల్స్..
అంతేకాకుండా 2014లో మాదిగ కులానికి సంబంధించి ఒక ఎంపీ సీటు ఇవ్వలేదని.. అదే వైసీపీ ప్రభుత్వంలో 2019లో 8 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చామని ఎంపీ సురేష్ తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీలు వైసీపీతోనే ఉన్నారన్నారు. మాదిగ సభలో టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడారని.. అలా మట్లాడటానికి సిగ్గుండాలని విమర్శించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 29 లక్షల కుటుంబాలకు మేలు జరిగితే.. కేవలం ఆంధ్రప్రదేశ్ లో 29 లక్షల రూపాయల మేలు జరిగిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వమైతే సబ్ ప్లాన్ లు అమలు చేసిన దానిలో ఏపీ నెంబర్ వన్ లో ఉందని తెలిపిందన్నారు.
Read Also: Largest Kidney Stone: కిడ్నీలో రాయి కాదు పెద్ద బండ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్
టీడీపీలోని కొందరు నేతలు చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారని.. ఇంకెన్నాళ్లు చంద్రబాబును నమ్ముతారు అని విమర్శించారు. మరోవైపు ఎస్సీలను రాజధానిలో దొంగల కింద చిత్రించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎస్సీలంటే గొప్పవారని చెప్పారని తెలిపారు. అటు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి అవమానించి పంపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుకు ఎస్సీలంటే నచ్చదని.. అంతేకాకుండా అన్నీ కులాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన మోసాలకు రాష్ట్ర ప్రజలు అందరూ జగన్ తోనే ఉన్నారని ఎంపీ సురేష్ తెలిపారు. అయితే ఎన్నికలు రాగానే కులాల కుంపట్లను చంద్రబాబు రాజేస్తున్నాడని దుయ్యబట్టారు. వచ్చే 15, 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని.. జగన్ పై టీడీపీ నేతలు పద్ధతి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.