NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: గాంధీ కుటుంబానికి కంచుకోటగా మారిన రాయ్ బరేలీ పరిస్థితేంటి..?

Priyanka Vs Rahul Gandhi

Priyanka Vs Rahul Gandhi

సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్, రాయ్ బరేలీ నియోజకవర్గాల ప్రస్తావన మొదలైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. రాహుల్‌కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానంలో వరుసగా 20 ఏళ్లు గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా వయనాడ్‌, రాయ్‌బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు.? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.

READ MORE: Maldives: మా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి.. మాల్దీవులు మంత్రి అభ్యర్థన

వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సరైన నిర్ణయమే తీసుకున్నారు. బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్‌బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక వయనాడ్‌ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానం సురక్షితమని రాహుల్ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్‌బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌ 7 లక్షల 6,000 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.

వయనాడ్‌లో ఈసారి పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్‌కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్‌ అటు వయనాడ్‌, ఇటు రాయ్‌బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్‌బరేలీని వదులుకుని, వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్‌ సంజయ్ గుప్తా అన్నారు. గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. ఆ స్థానంలో తన సోదరి ప్రియాంకా గాంధీని బరిలోకి దింపే అవకాశం ఉందని పేర్కొన్నారు.