NTV Telugu Site icon

WI vs BAN: భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్..

Wi Vs Ban

Wi Vs Ban

WI vs BAN: ఆంటిగ్వాలో వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్‌కు ఈ విజయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో విజయాల కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా టెస్టులలో వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇకపోతే, వెస్టిండీస్‌ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది. వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు 334 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. అయితే, విజిటింగ్ జట్టు 132 పరుగులకే కుప్పకూలడంతో వెస్టిండీస్ జట్టు 201 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది.

Also Read: Sreeleela: శ్రీలీలకు బంపరాఫర్.. సూపర్ హిట్ హీరోతో ఛాన్స్?

తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జస్టిన్ గ్రీవ్స్ సెంచరీ, కెమర్ రోచ్ హాఫ్ సెంచరీతో 9 వికెట్లు కోల్పోయి 450 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్‌ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో మికిల్‌ లూయిస్‌ 97 పరుగులు, జస్టిన్‌ గ్రీవ్స్‌ 115 నాటౌట్‌, అలెక్‌ అథనాజే 90 పరుగులు చేశారు. దీని తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బౌలర్ల ముందు కుప్పకూలి 269/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైంది. ఈ విధంగా బంగ్లాదేశ్‌కు 334 పరుగుల విజయ లక్ష్యం లభించింది. అయితే వెస్టిండీస్ బౌలర్లు బంగ్లాదేశ్ ను కేవలం 132 పరుగులకే ఆలౌట్ చేసి 201 పరుగుల తేడాతో విజయం సాధించారు.

Also Read: Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం

వెస్టిండీస్ చేతిలో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ జట్టు డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో కిందకు దిగజారింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ జట్టు 9వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకగా, బంగ్లాదేశ్ జట్టు మళ్లీ 9వ స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టు 27.50 విజయ శాతంతో 8వ స్థానంలో ఉంది. కానీ, ఇప్పుడు ఈ స్థానాన్ని వెస్టిండీస్ ఆక్రమించింది. వెస్టిండీస్ విజయ శాతం 18.52 నుండి 26.67 కి పెరిగింది. అయితే, బంగ్లాదేశ్ విజయ శాతం 25 కి పెరిగింది. WTC ఫైనల్ రేసులో ఇప్పటికే ఇరు జట్లు లేవు. ప్రస్తుతం భారత జట్టు నంబర్-1 స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు తర్వాతి స్థానంలో ఉంది.