Virat Kohli Fan: కొడుకు ఆట కాకుండా.. విరాట్ కోహ్లీని చూడడానికే స్టేడియంకు వచ్చిన వెస్టిండీస్ ప్లేయర్ తల్లి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Indies Cricketer Da Silva Mother Kisses Virat Kohli at IND vs WI 2nd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనోడికి భారీగా అభిమానులు ఉన్నారు. కోహ్లీ కనిపిస్తే చాలు ఈలలు, కేకలు వేస్తుంటారు. అతడిని కలవాలని ఫాన్స్ చూస్తుంటారు. కొందరు అయితే బారికేడ్స్ కూడా దాటి మైదానంలో ఉన్న కోహ్లీని కలిశారు. ఇదంతా మాములే. తాజాగా ఓ క్రికెటర్ తల్లి కూడా కోహ్లీని కలిసి తెగ సంబరపడిపోయారు. తన ఆరాధ్య క్రికెటర్‌ను కలిసిన ఆనందంలో తబ్బిబ్బైపోయారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండో రోజు విండీస్ వికెట్ కీపర్ జాషువా డా సిల్వా తల్లి తన కొడుకు ఆట కోసం కాకుండా.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూసేందుకు వచ్చారు. కోహ్లీ సెంచరీ చేయడంతో ఆమె ఆనందానికి అవద్దులేకుండా పోయాయి. ఇక రెండో రోజు మ్యాచ్ అనంతరం టీమిండియా బస్ వద్దకు జాషువా తల్లి వచ్చి కోహ్లీని కలిశారు. ఆమె ఎంతో ఆప్యాయంతో కోహ్లీని కౌగిలించుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
జాషువా డా సిల్వా తల్లి మాట్లాడుతూ… ‘నేను, నా కొడుకు విరాట్ కోహ్లీకి పెద్ద ఫాన్స్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో టెస్టు ఆడుతున్న తన ఫెవరేట్ క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకే నేను స్టేడియానికి వచ్చా. కోహ్లీతో పాటు నా కొడుకు ఒకే మైదానంలో ఆడడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. మొదటిసారి కోహ్లీని కలిశాను. అతడు అద్భుతమైన వ్యక్తి, చాలా ప్రతిభావంతుడు. కోహ్లీలా నా కుమారుడు అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
Also Read: IND vs BAN Fight: మూసుకుని పెవిలియన్‌కు పో.. భారత్, బంగ్లా ఆటగాళ్ల మధ్య గొడవ!
విరాట్ కోహ్లీపై తన తల్లికి ఉన్న అభిమానం గురించి విండీస్ వికెట్ కీపర్ జాషువా ది సిల్వా కూడా స్పందించాడు. రెండో టెస్టు సందర్భంగా జాషువా మాట్లాడుతూ… ‘మా అమ్మ ఫోన్ చేసి నేను విరాట్ కోహ్లీని చూసేందుకు మైదానానికి వస్తున్నా అని చెప్పింది. ఆ మాట చెప్పగానే నేను షాక్‌కు గురయ్యా. అయితే నా ఆటను చూసేందుకు కాకుండా.. కోహ్లీ కోసం రావడమేంటని నేను అస్సలు అనుకోలేదు. అసూయ కూడా పడలేదు. ఎందుకంటే కోహ్లీ అంటే మా అమ్మకు పిచ్చి, అతడికి పెద్ద అభిమాని’ అని అన్నాడు.
Virat Kohli with the mother of Joshua Da Silva.
What a lovely picture. pic.twitter.com/izT9HWFJk9
— Johns. (@CricCrazyJohns) July 22, 2023
https://twitter.com/takenbypratik/status/1682603060592275457?s=20
Mother of West Indies keeper Joshua Da Silva was emotional after meeting Virat Kohli, she wanted to meet him so badly! Just wow…
I have never seen a parent of an opposition player wanting to meet a cricketer to this extent. Kohli is an emotion ❤️- via Vimal Kumar YT #WIvIND pic.twitter.com/UEFMAOWGEE
— Farid Khan (@_FaridKhan) July 22, 2023
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..