Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. బైక్ పై అతి వేగంతో వచ్చి డివైడర్ ను ఢీకొన్న యువకులు ఘటన స్థలంలోనే కుప్పకూలిపోయారు. స్థానికులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే చనిపోయినట్లు తెలిపారు.
Read Also: Kalam kaval : రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘మమ్ముట్టి’ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాలంకవాల్
అయితే, మృతులు సత్య నారాయణ, అంజిబాబు, రాజులుగా గుర్తించారు. ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. క్రిస్మస్ వేడుకల అనంతరం యువకులు ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
