Site icon NTV Telugu

Mamata Banerjee: ప్రచారంలో మమత దూకుడు.. మహిళలతో కలిసి డ్యాన్స్

Mamatha

Mamatha

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షులైతే.. తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల నుదిటకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. గాయం నుంచి కోలుకోవడంతో ప్రచారంలో స్పీడ్ అందుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో గాలి, వానతో పలు ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. దీంతో సోమవారం మమత బాధితులను పరామర్శించారు.

ఇది కూడా చదవండి: Vijaya Sai Reddy: అధికార దాహంతోనే పొత్తు.. టీడీపీపై కీలక వ్యాఖ్యలు

ఇక మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్పాయిగురిలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గిరిజనులతో సమావేశం అయ్యారు. అనంతరం వారితో కలిసి నృత్యం చేశారు. గిరిజన మహిళలతో కలిసి సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అనంతరం డ్రమ్ములు వాయించి ఉత్సాహ పరిచారు.

ఇది కూడా చదవండి: Tollywood: టాలీవుడ్లో వరుస విషాదాలు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి!

ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల నేతలు కార్యకర్తలను, అభిమానులను ఉత్సాహ పరిచేందుకు ఆయా విన్యాసాలు చేస్తున్నారు. ఎక్కడికెళ్తే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఇలా నేతలంతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న జరగనుంది. ఇక చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Exit mobile version