గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఇదే అంతిమ బడ్జెట్ అని ఆమె వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్రం నిలిపివేసిందని ఆరోపిస్తూ కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు. వివిధ సామాజిక సంక్షేమ పథకాల కోసం కేంద్రం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2011లో తమ ప్రభుత్వం తొలిసారి అధికారం చేపట్టినప్పటినుంచి.. కేంద్రం నిధులు ఎలా వినియోగించిందన్న పత్రాలను సమర్పించామని మమత చెప్పారు. తాము అధికారంలోకి రాకముందు.. వామపక్ష ప్రభుత్వ పాలనలో జరిగిన దానికి మేం ఎందుకు బాధ్యత వహించాలి? అని ఆమె ప్రశ్నించారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్ష పార్టీలు ఇప్పటికే ధ్వజమెత్తాయి. తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ మోడీ సర్కార్‌పై మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో పేదలకు ఒరిగేది ఏమీలేదని కాంగ్రెస్ ఆరోపించింది.