Shocking Incident: కొన్ని సంఘటనలు మనుషులను భయబ్రాంతులకు గురి చేస్తాయి. వాటిని చూస్తే ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు.. అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోని దిన్‌హాటా ప్రాంతంలో తాజాగా వెలుగు చూసింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా.. మనిషి మాంసాన్ని తినాలనే ఉద్దేశ్యంతో ఒక వ్యక్తిని హత్య చేయడం. ఈ సంఘటన మొత్తం బెహార్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Good News : రైతన్నకు శుభవార్త.. సన్న ధాన్యానికి బోనస్ విడుదల
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కుసార్ హాత్ సమీపంలోని జలాశయంలో అతని మృతదేహం గుర్తించామని చెప్పారు. గుర్తు తెలియని యువకుడి మెడ, గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. మృతుడి గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని చెప్పారు. మృతుడు శ్మశాన వాటికలో ఒక గుడిసెలో నివసించినట్లు సమాచారం. ఈ కేసులో ఫిర్దౌస్ ఆలం అనే యువకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, హత్య తర్వాత, ఆయన మృతుడి మృతదేహాన్ని నీటి కుళాయి వద్దకు తీసుకెళ్లి, శుభ్రం చేసి, తరువాత దాచిపెట్టాడని చెప్పారు. నిందితుడు మృతుడి శరీరంలోని కొన్ని భాగాలను తినాలని అనుకున్నాడని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు.
అనంతరం దిన్హాటా SDPO ధీమాన్ మిత్రా మాట్లాడుతూ.. ఈ కేసు చాలా అరుదైనది, తీవ్రమైనదని పేర్కొన్నారు. మనిషి మాంసాన్ని తినాలనే ఉద్దేశ్యంతో నిందితుడి మృతుడిని చంపారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఇది నరమాంస భక్షణకు సంబంధించిన అరుదైన కేసుగా పరిగణించబడుతోందని వెల్లడించారు. నిందితుడి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని, ఆ సమాచారం ఆధారంగానే అతన్ని అరెస్టు చేశామని SDPO చెప్పారు. ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రో-కో మధ్యే అసలైన పోరు..
