Site icon NTV Telugu

West Bengal: బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేపై దాడి.. రక్తం కళ్ల జూసిన నిరసనకారులు..

Bjp

Bjp

West Bengal: ఉత్తర బెంగాల్‌లోని నాగరకటలో వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఎంపీ ఖాగెన్ ముర్ముపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ నాయకులు స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కుట్రగా బీజేపీ అభివర్ణిస్తోంది. ఈ ఘటన జల్‌పాయీగూడీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.

READ MORE: Vijay Deverakonda: మొన్ననే ఎంగేజ్మెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ..!

స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడటంతో జల్‌పైగురి ప్రాంతం అతలాకుతలమైంది. దీంతో సోమవారం నార్త్‌ మాల్దా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము, స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ ప్రతినిధుల బృందం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించింది. బాధితులకు సహాయసామగ్రి పంపిణీ చేస్తున్నారు. కొందరు స్థానికులు వీరిపైకి రాళ్లు విసిరారు. ఈక్రమంలోనే ఖాగెన్‌ ముర్ము తలకు బలమైన దెబ్బలు తగిలి.. ధారాళంగా రక్తం కారింది. ఆయన ధరించిన కుర్తా సైతం రక్తంతో తడిసి ముద్దైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున జనాలు మారణాయుధాలతో బీజేపీ నేతలపై దాడికి తెగబడినట్లు వీడియోలో రికార్డైంది. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. వారిని బయపెట్టేందుకు ఎంపీ ఖాగెన్‌ ముర్ముపై రాళ్లు, చెప్పులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు.

READ MORE: AAP Bihar Candidates List: బిహార్ అసెంబ్లీ ఫైట్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ లీస్ట్.. ఒంటరి పోరుకు దిగిన ఆప్

విషయం గుర్తించిన పలువురు స్థానికులు, ఎంపీ వెంట ఉన్న నాయకులు.. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి ముందు బీజేపీ ప్రతినిధులను అడ్డుకునేందుకు 500 మందికిపైగా స్థానికులు రహదారులపై బైటాయించారు. ‘గో బ్యాక్’ అనే నినాదాలతో బీజేపీ బృందాన్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో గాయపడిన ఎంపీ, ఎమ్మెల్యేలను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే.. ఈదాడిపై బీజేపీ స్పందించింది. పార్టీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్టు చేశారు. బెంగాల్‌లో తృణమూల్‌ ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Exit mobile version