Site icon NTV Telugu

Weight Loss Tips : వీటిని రోజూ ఇలా తీసుకుంటే చాలు..త్వరగా బరువు తగ్గుతారు..!

Low Fat Diet Food

Low Fat Diet Food

ఈరోజుల్లో అధిక బరువు అనేది అనారోగ్య సమస్యగా మారింది..బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. అయితే బరువు తగ్గడం అంత సులువు కాదు.. కానీ కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు..ఎటువంటి ఆహారాలను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

సాదారణంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు మనం కూడా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు 6 రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ఆరు రకాల ఆహార పదార్థాలు కూడా మనకు అందుబాటులో ఉండేవే. బరువు తగ్గడంతో పాటు శరీరానికి పోషకాలను అందించే ఈ ఆరు రకాల ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిలో పెసరపప్పు కూడా ఒకటి..పెసరపప్పును తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు వేగంగా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మజ్జిగను తీసుకోవడం వల్ల కూడా మనం సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభించడంతో పాటు పొట్ట కూడా నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు చియా విత్తనాలను తీసుకోవడం వల్ల సులభంగా బరువును కంట్రోల్ చెయ్యొచ్చు..

ఇకపోతే క్యాలీప్లవర్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉన్నప్పటికి బరువు తగ్గడంలో ఇది కూడా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు తోటకూరను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.. ఇక రాగులు.. వీటిలో ఫైబర్, ఐరన్ ఎక్కువ ఉంటుంది.. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.. వీటితో పాటు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.. అదే విధంగా నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఎప్పుడు కూర్చొని బరువు తగ్గాలంటే అస్సలు తగ్గరు.. కాస్త శారీరక శ్రమ కూడా బరువు త్వరగా తగ్గుతారు..

Exit mobile version