NTV Telugu Site icon

Weight Loss food : ఉదయం ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది..

Diet Breakfast

Diet Breakfast

ఈరోజుల్లో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది.. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. బరువు తగ్గడానికి ఎటువంటి ప్రయత్నాలు లేకుండా కేవలం బ్రేక్ ఫాస్ట్ లో చిన్న మార్పులు చేస్తే చాలు చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ అల్పాహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఉడికించిన గుడ్లు..

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే.. అందుకే డాక్టర్లు రోజుకో కోడి గుడ్డును తినాలని చూసిస్తున్నారు.. ఉడికించిన గుడ్లు కూడా ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్. వీటిని ప్రిపేర్ చేయడం కూడా ఈజీ. ఎన్నో పోషకాలతో నిండిన గుడ్లని ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చల్లి తినొచ్చు.. మిరియాలు అధిక బరువును కంట్రోల్ చెయ్యడంతో పాటు మరెన్నో సమస్యలకు చెక్ పెడుతుంది..

మిక్స్‌డ్ నట్స్..

డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచిది.. ప్రోటీన్స్ మినరల్స్ సమపాళ్ళల్లో ఉంటాయి.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి..వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎంత తినాలనేదానిపై జాగ్రత్త ఉండాలి.. ఏదైనా లిమిట్ గా తీసుకోవడం మంచిది..

శనగలు..

ఫ్రై చేసిన శనగలు కూడా క్రంచీగా ఉండడమే కాకుండా ఫైబర్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్. వీటిలో రుచి కోసం జీలకర్ర, వెల్లుల్లి, కారం, మసాలా వంటివి కలపొచ్చు. అవి స్టమక్ ఫిల్లింగ్ ఫీలింగ్‌నిస్తాయి.. ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా చేస్తాయి.. దాంతో క్యాలరీలు కరుగుతాయి..

మూంగ్ దాల్..

మూంగ్ దాల్ చిల్లా అనేది పెసలతో తయారు చేస్తారు. ఇది ప్రోటీన్‌తో నిండి తరిగిన కూరగాయలు, జీలకర్ర, పసుపు, కొత్తిమీరతో తయారు చేస్తారు. పుదీనా చట్నీతో సర్వ్ చేస్తారు. అందుకే, వీటిని చేసుకుని హ్యాపీగా తిని బరువు తగ్గవచ్చు.. కొంతమంది మొలకలు కూడా తింటారు..

స్ప్రౌట్స్ చాట్..

మొలకలు అనేవి ప్రోటీన్, ఫైబర్‌కి గొప్ప మూలం. మొలకలు తరిగిన ఉల్లిపాయలు, టమాటలు,, దోసకాయ, కొత్తిమీర ఆకులు, నిమ్మరసం కలపండి. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఉదర సమస్యలు కూడా తగ్గిపోతాయి.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి..

ఇవేకాదు దోసకాయలు హైడ్రేటింగ్, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్. సంతృప్తికరమైన, పోషకమైన బ్రేక్‌ఫాస్ట్ కోసం వాటిని వేరేవాటితో కలిపి తినొచ్చు.. నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలను కూడా తీసుకోవడం మంచిదే..