Chandrababu Naidu Davos Visit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడుల వేటలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరనుంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొని, గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని అమరావతి వైపు తిప్పడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ తో గడపనున్నారు. రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, నూతన పారిశ్రామిక విధానాలు ఇంకా ప్రభుత్వ మద్దతును అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేందుకు ‘ఏపీ లాంజ్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Komuravelli Mallanna Jatara 2026: నేటి నుంచి కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రపంచ స్థాయి టెక్, పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, మౌలిక సదుపాయాలు మరియు తయారీ రంగాల్లో సహకారంపై ఈ చర్చలు ప్రధానంగా సాగనున్నాయి. ఇందుకోసం నేడు విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి జ్యూరిచ్‌కు సీఎం బృందం వెళ్తుంది. జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్ లో సుమారు 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్టీలను (NRTs) ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు.
Karthi : లోకేష్ కనకరాజ్ పై అసంతృప్తి.. సూపర్ హిట్ సీక్వెల్ నుండి కార్తీ ఔట్..
అలాగే స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్, ఎరోస్ ఇన్నోవేషన్ ప్రతినిధులతో మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తారు. ఆపై అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన మీడియా సంస్థ ‘పొలిటికో’కు ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. యువతకు ఉపాధి కల్పన, ఏఐ (AI) వంటి నూతన సాంకేతికతను రాష్ట్రంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వీరు కృషి చేయనున్నారు. ఈ దావోస్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ స్థాయిలో ఒప్పందాలు (MoUs) కుదురుతాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
