వీకెండ్ వచ్చేస్తోంది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదా? హైదరాబాద్‌లో ఉన్న ప్లేస్‌లు అన్నీ చూసేశాం. సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు. అలా అని ఇంట్లో కూడా ఉండబుద్ది కాదా? అయితే మీలో ఉండే సృజనాత్మకను పెంచే కార్యక్రమాలు, ఒకవేళ మీరు కామెడీని ఇష్టపడేటట్లు అయితే అలాంటి షోలు చాలానే మీకోసం ఈ వీకెండ్ సిద్ధంగా ఉన్నాయి. ఓ లుక్ వేసేయండి.
క్రోచెట్ త్రోబ్లాంకెట్ వర్క్‌షాప్
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు ఒక మంచి కళను నేర్చుకోగలగుతారు. ఇందులో హుక్ లేకుండా చేతినే హుక్‌లా ఉపయోగించి ఉన్నితో బట్టలు, దుప్పట్లు కుట్టడం నేర్పిస్తారు. చాలా మంది నిపుణులు మీకు దీనిని నేర్పించడానికి ఈ వర్క్‌షాప్‌లో సిద్ధంగా ఉంటారు. మీకు కొత్త కళలు నేర్చుకోవడంలో ఆసక్తి ఉంటే ఈ వర్క్‌షాపుకు హాజరయితే ఖచ్చితంగా రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. ఈ వర్క్‌షాపును అలైన్‌హబ్, ఫిలింనగర్‌లో ఆగస్టు 12వ తేదీన నిర్వహిస్తున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. పేటియం ఇన్‌సైడర్‌లో రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది.
సొంత డబ్బా సరుకుల సంత
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫుడ్, రీపర్పస్డ్ వస్తువుల గురించే వినిపిస్తున్నాయి. ఈ సొంత డబ్బా సరుకుల సంత కూడా వీటికి సంబంధించిందే. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన అనేక మంది ఇక్కడకు వచ్చి వారి ప్రొడక్ట్స్ ను అమ్ముతున్నారు. ఇందులో రైస్, చిరుధాన్యాల నుంచి కాటన్ బట్టలు, కెమికల్స్ లేని బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమం ఆగస్టు 13 న నాగోల్ లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. దీనికి హాజరయ్యేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
రెజిన్ బీచ్ వర్క్‌షాప్:
గత కొంత కాలంగా రెజిన్ ఆర్ట్ కు ఆదరణంగా పెరుగుతుంది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ద్వారా మీరు రోజంతా ఈ ఆర్ట్ ను నేర్చుకోవచ్చు. దీనికి అవసరమైన వస్తువులను కొనుకోవచ్చు కూడా. ఈ కార్యక్రమం ఆగస్ట్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఫిలింనగర్‌లోని ట్రఫెల్ టవర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. రిజిస్ట్రేషన్ కొరకు Check out https://linktr.ee/Varshitha వెబ్‌సైట్‌ను సందర్శించండి.
లైవ్ స్టాండ్-అప్ షోలు:
మీకు స్టాండ్-అప్ కామెడీ ఇష్టమైతే ఈ వారం మీరు ఫుల్ ఎంజాయ్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీకెండ్‌లో నగరంలో రెండు లైవ్ స్టాండ్-అప్ కార్యక్రమాలు జరగనున్నాయి. అందులో ఒకటి
బస్సీ లైవ్ స్టాండ్-అప్:
నటుడు, స్టాండ్-అప్ కామిక్ అనుభవ్ సింగ్ బస్సీ తన కామెడీతో ఎంటర్‌టైన్ చేయడానికి ఈ వీకెండ్ హైదరాబాద్ రానున్నారు. తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా జోక్‌లు, ఫన్నీ స్టోరీస్‌తో కడుపు నింపుకొని పగలబడి నవ్వుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరు అవ్వండి.
ఈ కార్యక్రమం ఆగస్టు 12, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 వరకు శిల్పకళా వేదిక, హైటెక్ సిటీలో జరగనుంది. బుక్ మై షోలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: Uber Driver Idea: ఉబెర్ డ్రైవర్ సూపర్ ఐడియా… ఫిదా అవుతున్న ప్యాసింజర్లు
ఇక మరో లైవ్ స్టాండ్-అప్ షో లైట్ తీస్కో
ఇంగ్లీష్‌లో, హిందీలో వేసే జోకులు ఏం అర్థమవుతాయి, అవి మాకెందుకులే అనుకుంటుంటే తెలుగు ప్రేక్షకుల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడిన తెలుగు స్టాండప్ కామెడీ షో ఈ లైట్ తీస్కో. ఇందులో ఎటువంటి అసభ్యతకు తావులేని జోకులను హాస్య రచయితలు RJ అవినాష్, జాన్ పాల్, అనుదీప్, గురు జాగ్రత్తగా వ్రాసి వాటిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంచారు. ఈ షో ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 నుంచి 8.30 వరకు ఆరోమలే కేఫ్, ఫిల్మ్ నగర్‌లో నిర్వహించబడుతుంది. రిజిస్ట్రేషన్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం మీ అభిరుచికి తగ్గట్టుగా వీటిలో ఏ కార్యక్రమానికి హాజరుకావాలో ప్లాన్ చేసుకోండి.