NTV Telugu Site icon

Weekend OTT Movies: ఈ వీకెండ్‌కు 24 సినిమాలు.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే!

Maruthi Nagar Subramanyam

Maruthi Nagar Subramanyam

Weekend OTT Movies: వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం వెతకడం ఇప్పుడు కామనైపోయింది. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ వేదికగా ఇంటిల్లిపాదిని అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఓవైపు కామెడీ ఎంటర్‌టైనర్స్‌, మరోవైపు సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌తో ఈ వీకెండ్‌ ఓటీటీ వేదికగా వినోదం లభించనుంది. ఈ వీకెండ్‌కు 24 సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే ఉంది.

Also Read: Sara Ali Khan: జాన్వీ కపూర్ బాటలో సారా అలీ ఖాన్.. సరైన కథ కోసం ఎదురుచూపు!

కోలీవుడ్‌ స్టార్ హీరో విక్రమ్‌ నటించిన ‘తంగలాన్‌’ సినిమా నేడు ఓటీటీకి వస్తోంది. తంగ‌లాన్ ఓటీటీ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో తంగ‌లాన్ రిలీజ్ కానుంది. ఇక ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. రావు రమేశ్‌, ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ వారం తంగలాన్‌, మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తిరగబడరా సామి, పెచీ, రుస్లాన్ మూవీస్ కూడా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.

Show comments