Site icon NTV Telugu

Lord Ganesh Remedies: బుధవారం వినాయకుడికి ఈ పరిహారాలు చేస్తే.. అదృష్టం, సంపద మీ వెంటే!

Lord Ganesh Remedies

Lord Ganesh Remedies

Wednesday Lord Ganesh Remedies: సనాతన ధర్మంలో గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని దేవతలలో కెల్లా మొదటి ఆరాధకుడిగా గణేశుడు పరిగణించబడ్డాడు. వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడానికి కారణం ఇదే. ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. బుధవారం రోజున గణేశుడిని పూజిస్తే శుభ ఫలాలు లభిస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నా.. ఏ పని జరగకున్నా బుధవారం నాడు కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా గణపతిని ప్రసన్నం చేసుకోవచ్చు. దాంతో మీ సమస్యలు తొలగిపోతాయి. బుధవారం చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం.

# బుధవారం సూర్యోదయానికి ముందు 2 చేతులా కొన్ని పెసల్లు తీసుకుని.. మీ మీది నుంచి తిప్పుకోండి. ఆ తరువాత ప్రవహించే నీటిలో వాటిని పోయండి. ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

# బుధవారం వినాయకుడిని పూజించిన తర్వాత నపుంసకుడికి (హిజ్రా) కొంత డబ్బును దానం చేయండి. వారి నుంచి కొంత డబ్బును తీసుకొని పూజా స్థలంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

# బుధవారం రోజున ఆలయానికి వెళ్లి గణేశుడికి బెల్లం లేదా మోదకం సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇల్లు ఎప్పుడూ సిరిసంపదలతో నిండి ఉంటుంది.

Also Read: 498 BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 498తో 6 నెలల వ్యాలిడిటీ!

# బుధవారం నాడు గణేశుడి నుదుటిపై కుంకుమ రాసి.. ఆపై మీ నుదుటిపై రాసుకోండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది.

# సనాతన ధర్మం ప్రకారం బుధవారం నాడు ఆలయానికి వెళ్లి గణేశుడికి లడ్డూలు మరియు దుర్వా గడ్డిని సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల గణేశుడి అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు మీ కష్టాలు తొలగిపోతాయి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)

Exit mobile version