Viral : పెళ్లికి మన దేశంలో అత్యున్నత స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో పెళ్లి కీలక పాత్ర పోషిస్తుంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై జీవితాంతం ఒక్కటిగా ఉంటారు. ఇటీవల కాలంలో పెళ్లికి అర్థాలే మారిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతున్నారు. కొన్ని పెళ్లిళ్లు అయితే పీటలు మీద.. ఇంకొన్ని పెళ్లి పీటలు ఎక్కక ముందే ఆగిపోతున్నాయి. అలాంటి ఘటన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Trump-Elon Musk: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మస్క్‌కు కీలక పోస్ట్ అప్పగింత
యూపీఎస్సీ (UPSC) పరీక్షకు సిద్ధమవుతున్న వరుడు, వధువు తండ్రి పంపిన బహుమతులపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ ఘటన గురించి రెడిట్‌లో (Reddit) పోస్ట్ చేశారు. అక్కడ ఒక యూజర్ వధూవరుడు, వధువు మధ్య జరిగిన WhatsApp చాట్ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసి ఆన్లైన్‌లో పెద్ద చర్చకు దారి తీశారు. పోస్ట్‌లో వధూవరుడు తన భవిష్యత్తు మామ పంపిన బహుమతులు ఇష్టం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విషయం వధువు కుటుంబ సభ్యులను నిరాశకు గురిచేసింది. ఫలితంగా వధువు కుటుంబం వివాహం రద్దు చేసేందుకు నిర్ణయించుకుంది.
Read Also:Harish Rao: 12 రోజులు గడస్తున్నా.. ఇంకా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు!
కామెంట్లలో యూజర్ వివాహం రద్దు అయిన విషయాన్ని ధృవీకరించారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. పలు యూజర్లు వధువు కుటుంబం తమ మాటను నిలబెట్టుకున్నందుకు అభినందించారు. కొందరు రెడిట్ యూజర్లు వరుడి ప్రవర్తనను “రెడ్ ఫ్లాగ్” గా పేర్కొంటున్నారు.