Delhi Weather : డిసెంబర్ నెలలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఉదయం పొగమంచు కనిపిస్తోంది. పొగమంచు కారణంగా రోడ్డుపై దృశ్యమానత తగ్గుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం, డిసెంబర్ 13 – 16 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయి. అరుణాచల్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో కూడా మంచు కురుస్తోంది.
Read Also:Prashanth Neel: ఈయన కింగ్ ఖాన్ పైన పగబట్టినట్లు ఉన్నాడు…
దీనితో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో తేలికపాటి వర్షంతో పాటు మంచు కురుస్తోంది. హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వతాలకు చేరుకుంటున్నారు. సోమవారం ఉత్తరాఖండ్‌లోని ఔలిలో గరిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలుగా నమోదైంది. బద్రీనాథ్ ధామ్‌లో ఉష్ణోగ్రత గరిష్టంగా 3 డిగ్రీలు, కనిష్టంగా మైనస్ 4 డిగ్రీలకు చేరుకుంది.
Read Also:Japan Movie : ఓటీటీలోకి వచ్చేసిన జపాన్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో చలి గాలులు వీస్తున్నాయి. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత ఆదివారం నాటి 8.3 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. ఈ ఏడాది సాధారణం కంటే సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు తక్కువగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, వాయువ్య గాలుల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ రాబోయే కొద్ది రోజుల్లో చల్లగా మారుతుంది.
