NTV Telugu Site icon

AP Rains Alert: ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరికలు..!

Ap Rains

Ap Rains

Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతుంది అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు తుఫాన్ గా మారితే రెమల్‌గా నామకరణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొనింది. పార్వతీపురం మన్యంతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అంతేగాక, అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.

Read Also:
Shah Rukh Khan Health Update: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ పోస్ట్‌!
కాగా, ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ఖాతంలో తుఫాన్ గా వాయుగుండం మారనుంది. ఏపీ తీరం వెంబడి ప్రయాణిస్తూ ఈ నెల 25 నాటికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. మే 26వ తేదీ సాయంత్రానికి బంగ్లాదేశ్‌- బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండంతో అలజడిగా మారిన సముద్రం.. బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి.. ఇక, మత్స్యకారులు, రవాణా నౌకలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.