ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. తూర్పుమధ్య బంగాళాఖాతం & దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి కొనసాగుతోంది.
దీని ప్రభావము వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతములలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతము తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి 13°N అక్షాంశము వెంబడి తూర్పుమధ్య బంగాళాఖాతం & దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి కర్ణాటక తీరానికి దగ్గరగా తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 4.5 km నుండి 5.8 km ఎత్తుల మధ్య కొనసాగుతోంది.వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Tags
- ap
- Heavy rains
- weather update
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!