వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఏపీ, తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వాతావరణ శాఖ అందించిన వివరాలను వెల్లడించింది. ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమ-వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది అల్పపీడనం. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి దక్షిణ ఒడిశా- దక్షిణ ఛత్తీస్‌గఢ్ వద్ద బలహీనపడే అవకాశం వుందని తెలిపింది.
దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అప్రమత్తంగా వుండాలని పేర్కొంది.దక్షిణ ఒడిషా-ఉత్తరాంధ్ర ను అనుకుని కొనసాగుతుంది వాయుగుండం. సాయంత్రం దక్షిణ ఒడిశాలో తీరం దాటి బలహీనపడనుంది వాయుగుండం..తర్వాత ఒడిషా, ఛత్తీస్ గడ్ వైపు పయనించనుంది తీవ్ర అల్పపీడనం. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం వుంది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా వుంది. తీరం వెంబడి కొనసాగుతుంది గాలులు ఉధృతి.
Read Also: Krishnam Raju : మిస్ అయిన గవర్నర్ ఛాన్స్!
ఆంధ్రా -ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ. ఈరోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు రేపు తెలంగాణా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు నుండి మూడు రోజుల పాటు ఉరుములు మరియు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో తెలంగాణ రాష్ట్రంపై వీచే అవకాశం ఉంది.
