NTV Telugu Site icon

BIG Alert: పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

Weather

Weather

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఎల్లుండికి తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. తుపాను తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది.

Read Also: Israel-Hamas War Resume: ఇజ్రాయిల్, హమాస్‌ మధ్య ముగిసిన స్వాప్ డీల్.. పునఃప్రారంభమైన వార్..

అలాగే, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలను కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం చేస్తున్నారు. మరో వైపు, తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అటు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండ్రోజుల్లో అది తుపానుగా మారొచ్చని భారత వాతావరణ అధికారులు అంచనా వేశారు.