Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Wear Handlooms For Weavers Upliftment Says Ap Deputy Cm Pawan Kalyan

Pawan Kalyan: అందుకే నేత వస్త్రాలను ధరిస్తున్నాను.. కీలక ప్రకటన చేసిన పవన్‌ కళ్యాణ్

Published Date :August 7, 2024 , 3:30 pm
By Mahesh Jakki
  • చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
  • చేనేతకు జీవం పోయాలని సూచన
Pawan Kalyan: అందుకే నేత వస్త్రాలను ధరిస్తున్నాను.. కీలక ప్రకటన చేసిన పవన్‌ కళ్యాణ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Deputy CM Pawan Kalyan: చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆ బిల్లుకు ఆమోదం

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయన్నారు. అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం కచ్చితంగా చేనేత పరిశ్రమకు, ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని సంవత్సరాల కిందటే చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే నేత వస్త్రాలను ధరిస్తున్నానని వెల్లడించారు. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే ఈ రంగంపై ఆధారపడ్డవారికి ధీమా కలుగుతుందని పవన్ స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Deputy CM Pawan Kalyan
  • Handloom Day
  • latest news
  • pawan kalyan

తాజావార్తలు

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions