Site icon NTV Telugu

CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు

Siddaramaiah

Siddaramaiah

అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read Also: Yogi Adityanath: అయోధ్యకు పూర్వ వైభవం వచ్చింది..

రాముడిని సీత, లక్ష్మణ్‌ల నుంచి వేరు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య బీజేపీపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. లక్ష్మణుడు, సీత లేకుండా రాముడు లేడని.. రాముడు సర్వవ్యాపి అని అన్నారు. రాముడు కేవలం అయోధ్యకే పరిమితం కాలేదని తెలిపారు.

Read Also: PM Modi: రామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు

అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది.. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు..

Exit mobile version