NTV Telugu Site icon

MP Laxman: మోడీతో సరితూగే వ్యక్తి దేశంలో ఎవరూ లేరు..

Laxman

Laxman

జనగామ జిల్లా కేంద్రంలో సాయిరాం కన్వెన్షన్ హల్ ఏర్పాటు చేసిన వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల సమ్మేళనంలో బీజేపీ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జులా ప్రేమెందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీతో సరితుగే వ్యక్తి దేశంలో ఎవ్వరూ లేరన్నారు. 23 సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్క అవినీతి మచ్చ లేని వ్యక్తి మోడీ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఒక ఆకాశాన్ని మాత్రమే వదిలారు తప్ప అన్నింటిలో అవినీతే చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ప్రపంచంలో అన్న ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకున్నారు.. దేశాన్ని అన్ని విధాలుగా ముందుగా తీసుకుపోతున్న నాయకుడు మోడీ.. తెలంగాణలో బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు.

Read Also: Kalki 2898 AD : బుజ్జి ఈవెంట్ కి పర్మిషన్స్ టెన్షన్.. చివరి నిముషంలో..?

తెలంగాణను గత 10 సంవత్సరాలుగా అన్ని విధాలుగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్.. బీజేపీ మీ అందరూ భద్రత కోసం పని చేస్తుంది.. కరోనాను ఆరోగ్యశ్రీలో కలపలేదు కేసీఆర్ అందుకే చాలా ప్రాణాలు పోయాయి.. స్కిల్ ఇండియా పేరుతో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత మోడీ.. లక్ష పది వేల స్టార్టప్ లు పది సంవత్సరాలో చేసిన ఘనత మోడీ.. ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు.. ఉచితల పేరుతో పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి.. గాడిద గుడ్డు చూపెట్టి మీరు మాట్లాడే మాటలు ఎవ్వరూ నమ్మరు.. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి వాయిదాలతో పూట గడుపుతున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు జరిగితే గెలిచిలేది బీజేపీ పార్టీ యే.. మెదవులు అందరూ ఆలోచించి బీజేపీ పార్టీ అభ్యర్థి గుజ్జులా ప్రేమెందర్ రెడ్డినీ గెలిపించాలని కోరారు.. త్వరలోనే పీఓకేనీ మనం స్వాధీనం చేసుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు.