NTV Telugu Site icon

China-Russia : రష్యా-చైనా మధ్య వ్యూహపరమైన బంధాని అడ్డంకులు సృష్టిస్తే సహించం

China

China

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయిదోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వత తొలిసారి చైనపర్యటనకు వెళ్లారు. గురువారం నుంచి రెండ్రోజల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు చైనా అధ్యక్షుడు షీ జన్ పింగ్ ను కలిశారు. ఈ సందర్భంగా షీ జిన్ పింగ్ మాట్లాడుతూ..ఉక్రెయిన్‌ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని ఆకాంక్షించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషిచేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ (71) ప్రకటించారు.

READ MORE: Ujjain : క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో రూ.2 కోట్లు పోగొట్టుకుని… అప్పు తీర్చలేక ఆత్మహత్య

రష్యాకు అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ తొలి విదేశీ పర్యటనకు ఆయన చైనాను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు పలు వ్యాఖ్యలు చేశారు. అమెరికా గురించి చెబుతూ.. రష్యా-చైనాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించాలని అమెరికా చేసే ప్రయత్నాలను సాగనివ్వబోమని పుతిన్‌, జిన్‌పింగ్‌లు గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పరోక్షంగా స్పష్టం చేశారు. తమ దోస్తీ ఏ ఇతర దేశానికీ వ్యతిరేకం కాదని వెల్లడించారు. కాబట్టి దానికి విఘాతం కలిగించే ప్రయత్నాలను వమ్ము చేస్తామని పేర్కొన్నారు. బీజింగ్‌లో పుతిన్‌, జిన్‌పింగ్‌ల సమావేశం సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యూహపరమైన సహకార అభివృద్ధికి పలు ఒప్పందాలు కుదిరాయి. కాగా.. చైనా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ఓ వార్తా సంస్థతో పుతిన్ మాట్లాడారు. ‘‘యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర, సుస్థిర పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. ఉక్రెయిన్‌ తో చర్చల్లో- మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు.