Site icon NTV Telugu

Asaduddin Owaisi : మోడీకి భయపడేదే లేదు.. భయపడేది కేవలం అల్లాకు మాత్రమే : ఓవైసీ

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi : తాను అల్లాకు తప్ప ఎవరికీ భయపడనని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇతర ప్రజలకు కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయినా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా వారికి భయపడవద్దని సూచించారు. వారు పైన ఉన్న అల్లాకు మాత్రమే భయపడాలన్నారు. ఏఐఎంఐఎం చీఫ్ బుధవారం ఈ మేరకు 36సెకన్ల ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు.

Read Also:Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు.. రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్

ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ – ‘భూమిని, ఆకాశాన్ని సృష్టించినవాడికి మాత్రమే మేము భయపడతాము (అల్లాను ఉద్దేశించి). మిగిలిన వారు ఎవరికీ భయపడరు. నేనేమిటో, నా ప్రభువుకు తెలుసు.. నేను అల్లాకు మాత్రమే భయపడుతున్నాను.. మోడీకి భయపడవద్దు, షాకు భయపడవద్దు అని కూడా చెప్పడానికి వచ్చాను. ప్రభుత్వానికి భయపడవద్దు..ఎవరికీ భయపడవద్దు. అల్లాహ్‌కు మాత్రమే భయపడండి.’ అంటూ పేర్కొన్నారు.

Read Also:Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు.. రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్

దేశంలో రాముడి పేరుతో రాజకీయాలు జరుగుతున్న తరుణంలో అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రకటన చేశారు. యూపీలోని అయోధ్యలో జనవరి 22, 2024న రామ్ లల్లా దీక్షకు ముందు రాజకీయ నాయకులు, సాధువుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

Exit mobile version