Site icon NTV Telugu

Punjab CM: మీరు కేవలం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగలరు.. ఆయన ఆలోచనను కాదు..

Bhagwant Mann

Bhagwant Mann

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) అరెస్టు చేయడాన్ని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తీవ్రంగా ఖండించారు. ‘మీరు కేవలం కేజ్రీవాల్‌ను మాత్రమే అరెస్టు చేస్తారు.. కానీ ఆయన ఆలోచనను బంధించలేరు అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ఒక వ్యక్తి కాదు.. ఆలోచనా విధానం.. తామంతా ఆయనతోనే నిలబడతామని ఆయన ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై నిప్పులు కురిపించారు.

Read Also: Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!

అయితే, నోటీసులు ఇస్తామంటూ ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. ఆ తర్వాత సోదాలు చేసి.. విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా కేజ్రీవాల్‌కు అధికారులు తెలిపారు.. అందుకు ఆయన నిరాకరించడంతో ఇంట్లోనే విచారించాలని కోరారు. కాసేపటి తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఇక, రాత్రి అంతా ఢిల్లీ సీఎం ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కాగా, కేజ్రీవాల్‌ను ఇవాళ ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. విచారణ కోసం ఈడీ ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. దాదాపు 13 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఇక, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మద్దతుదారులు నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

Exit mobile version