Jai SriRam : అయోధ్య రాముడి జలాభిషేకానికి పాకిస్థాన్‌లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి నీటిని తెప్పించనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 23న 155 దేశాల నదుల నీటితో రాముడి విగ్రహానికి మహా జలాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఢిల్లీకి చెందిన రామభక్తుడు విజయ్ జాలీ నేతృత్వంలోని బృందం వివిధ ఖండాల్లోని 155 దేశాల నదుల నీటిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయంలో ఘనంగా ‘జలాభిషేకం’ నిర్వహించనున్నట్లు రాయ్ తెలిపారు.
Read Also: Israel: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తత.. ఒకరిపై ఒకరు రాకెట్, వైమానిక దాడులు
ఏప్రిల్ 23న మణిరామ్ దాస్ కంటోన్మెంట్ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ‘మహా జలాభిషేకం’కు పూజలు చేస్తారని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌లోని రావి నదితో సహా 155 దేశాల నదుల నుంచి అభిషేకానికి నీరు వస్తుందని రాయ్ చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చే నీటి కుండలపై ఆయా దేశాల జెండాలు, వాటి పేర్లు, నదుల పేర్లతో కూడిన స్టిక్కర్లు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు దేశాల రాయబారులు కూడా పాల్గొంటారు.
Read Also: IPL 2023: లక్నోతో అమీతుమీకి సిద్ధమైన సన్ రైజర్స్ హైదరాబాద్
పాకిస్తాన్ నదుల నీటిని మొదట పాకిస్తాన్ హిందువులు దుబాయ్‌కి పంపారని, ఆపై దుబాయ్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చారని రాయ్ చెప్పారు. ఇప్పుడు ఈ నీటిని అయోధ్యకు తీసుకురానున్నారు. రాముడి జలాభిషేకానికి పాకిస్తాన్‌తో పాటు, సురినామ్, చైనా, ఉక్రెయిన్, రష్యా, కజకిస్తాన్, కెనడా, టిబెట్ సహా అనేక ఇతర దేశాల నదుల నుండి కూడా నీటిని తీసుకువస్తామని ఆయన చెప్పారు.