ప్రతి పండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. అలాంటి పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి… దీన్ని జీడీ మామిడి కాయ అని కూడా అంటారు.. చలికాలంలో మాత్రమే ఈ పండ్లు దొరుకుతాయి… ఈ చెట్టు ఒక పది అడుగుల ఎత్తు ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంది. కాల్షియం ఉంది. విటమిన్ బి వన్ ఉంది. విటమిన్ బి టు రైబో ఫ్లెవెన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు, విటమిన్లు ఉన్నాయి. ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి… అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
సీజనల్ వ్యాధులను తట్టుకోగల శక్తిని ఇస్తుంది.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. బ్యాక్టీరియా, వైరస్ ,ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయ వ్యాధి, టీవీ స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గడ్డకట్టుకునే నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.. ఈ పండులో పీచు ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గడానికి కూడా సహాయ పడుతుంది..
గ్యాస్ ట్రబుల్ నివారిస్తుంది.. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.. అలాగే మలబద్ధకం ఉన్నవారికి మొలలు మూలశంక పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య కూడా తగ్గుతుంది. విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఈ పండులో ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి.. రోజుకు ఒకటి చొప్పున తింటే ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.