NTV Telugu Site icon

Delhi metro: సీటులో చక్కగా కూర్చుని ఇద్దరు మహిళలు ఏం చేశారంటే..!

Delhi Meto

Delhi Meto

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో అంటేనే ఎప్పుడూ ప్యాసింజర్స్‌తో ఫుల్ రష్‌గా ఉంటుంది. సీట్ల కోసం కొట్టుకున్న వీడియోలు కూడా అనేకం చూశాం. ఇక రీల్స్ కోసం.. మెట్రోలో అమ్మాయిలు రకరకాలైన విన్యాసాల వీడియోలు కూడా చూశాం. అయితే తాజాగా ఢిల్లీ మెట్రోలో చోటుచేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Manjima Mohan: పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ.. చాలా బాధపడ్డాను- హీరోయిన్ ఆవేదన!!

ఇద్దరు మహిళలు ఒక సీటులో తాపీగా కూర్చుని.. సమోసాలను ఆస్వాదిస్తూ తీరిగ్గా ప్రయాణం చేశారు. చెత్త మాత్రం సీటు కింద పడేయడం విశేషం. అయితే రైల్లో ఉన్న వ్యక్తి.. దీన్ని మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సమోసాలు తింటూ చెత్త మాత్రం సీటు కింద పడేశారని క్యాప్షన్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్లకు పైగా వీక్షించారు.

ఇది కూడా చదవండి: Side effects of smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?

అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అలా తింటే తప్పేముందని.. చక్కగా సమోసాలను ఆస్వాదిస్తున్నారని ఒక నెటిజన్ తెలిపారు. బెల్లీ డ్యాన్స్, అసభ్యకరంగా ఏమి చేయలేదు కదా? అని మరొకరు పేర్కొన్నారు.