NTV Telugu Site icon

Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!

Surgery

Surgery

ఉత్తర్ ప్రదేశ్లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి యాజమాన్యం మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళకు వైద్యుడి చేయాల్సిన ఆపరేషన్ను వార్డు బాయ్ చేశాడు. అంతే కాకుండా.. ఆ వార్డు బాయ్ చేసిన ఆపరేషన్‌ను వీడియో తీశాడు. అనంతరం.. తన ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చేసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా.. ఈ వీడియోను ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో కానీ.. తెగ వైరల్ అవుతుంది.

Read Also: Kakani Govardhan Reddy: అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి హేయమైన చర్య

వీడియోలో వార్డు బాయ్ మహిళ బట్టలు విప్పి ఆపరేషన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాగా.. ఈ విషయం తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ ఘటన కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హార్దియాలో ఉన్న మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఐ సెంటర్ లో చోటు చేసుకుంది. ఇంతకుముందు కూడా.. ఈ వార్డు బాయ్‌ ఓ మహిళా పేషెంట్‌కి ఆపరేషన్‌ చేసినప్పుడు వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను తన వాట్సాప్‌, ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. కాగా.. ఆపరేషన్‌ సమయంలో వార్డు బాయ్‌ తీసిన వీడియోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Kolkata Doctor Case: ఆస్పత్రిలో అర్ధరాత్రి బీభత్సం.. ఆనవాళ్లు చెరిపేసిన 9 మంది అరెస్ట్

ఈ విషయానికి సంబంధించి.. CAO డాక్టర్ RS దూబే మాట్లాడుతూ, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని.. దీని కోసం MOIC మార్వాతీయ డాక్టర్ వినోద్ కుమార్‌ను దర్యాప్తు చేయాలని కోరామన్నారు. ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించామని.. ఈ ఘటనకు సంబంధించి నివేదిక వచ్చిందని తెలిపారు. కాగా.. ఈ వీడియో నాలుగు నెలల క్రితంది అన్నారు. మరోవైపు.. సంబంధిత వార్డు బాయ్‌ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. పాత వీడియో ఆధారంగా ఆస్పత్రిపై ఇంకా చర్యలు తీసుకుంటామని సీఎంవో తెలిపారు.

Show comments