Site icon NTV Telugu

Warangal: నిండు ప్రాణం తీసిన మద్యం మత్తు..! దోస్తులే కొట్టి చంపేశారు..

Liquor

Liquor

Warangal: వరంగల్‌లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఖిలా వరంగల్ తూర్పు కోటలో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. మద్యం సేవిస్తుండగా మాట మాట పెరగడంతో స్నేహితులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మిల్స్ కాలనీ సీఐ రమేష్‌ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మద్యం సేవించి దాడికి పాల్పడిన స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో తూర్పు కోట ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

READ MORE: Former Minister Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం..

Exit mobile version