Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ఈ నెల 21వ తేదీన అదృశ్యమైన నాలుగు నెలల చిన్నారి మిస్సింగ్ కేసును మట్టేవాడ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ ధార కవిత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీసీపీ వివరాల ప్రకారం.. చిన్నారి అదృశ్యమైన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, కన్నతల్లిదండ్రులే బిడ్డను విక్రయించినట్లు సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీసులు తల్లిదండ్రులు, మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.
మధ్యవర్తుల సహాయంతో రూ. 2 లక్షల 90 వేలకు చిన్నారిని విక్రయించినట్లు తల్లిదండ్రులు అంగీకరించారు. వరంగల్ దేశాయిపేట సమీపంలోని లక్ష్మీ మెగా టౌన్షిప్లో నివాసముంటున్న పిల్లలు లేని దంపతులకు ఈ చిన్నారిని అమ్మినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం డీసీపీ ధార కవిత చిన్నారిని ఐసీడీఎస్ (ICDS) అధికారులకు అప్పగించారు. ఈ శిశు విక్రయ వ్యవహారంలో తల్లిదండ్రులు, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో కలిపి మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.
Also Read
- Kavya Maran - Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
- Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
- WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
- 144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
-
Kavya Maran – Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
-
Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
ట్రెండింగ్
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి