Site icon NTV Telugu

Heavy Rains: వరదల్లో వరంగల్ దిగ్బంధం.. బిల్డింగ్ లపై తలదాచుకున్న బాధితులు

Warangal Rains

Warangal Rains

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలతో హంటర్‌ రోడ్‌ నీట మునిగింది. దీంతో నయూంనగర్, శివనగర్ లకు చెందిన వరద బాధితులు బిల్డింగ్‌లపై తలదాచుకుంటున్నారు. హంటర్‌ రోడ్డుకు ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తమకు సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ తెగిపోయింది. ఇప్పటికే వరదనీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి.

Read Also: Health Tips: రోజ్ వాటర్ తో కంటి సమస్యలకు చెక్..

వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సంతో కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. హనుమకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు భారీగా నిలిచింది. వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమవ్వగా, పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. మైలారం దగ్గర భారీ చెట్టు కూలి అధిక సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. మరో రెండు రోజులు జిల్లా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో.. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.

Read Also: Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికేంటి? ఎవడ్రా రాసింది ఇది?

అయితే, ఇప్పటికే కాజీపేట రైల్వే స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో కనెక్టవిటీ తెగిపోయింది. వరంగల్ నుంచి వచ్చే వరదతో హంటర్ రోడ్డులో పూర్తిగా నిలిచిపోయిందని బాధితులు పేర్కొంటున్నారు. గత రాత్రి నుంచి వరద నీటిలోనే ఉన్నట్లు బాధితులు తెలియజేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌(జంక్షన్‌)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-కాజీపేట రూట్‌లో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను ఇప్పటికే దారి మళ్లించారు.

Exit mobile version