Warangal Anganwadi Child Assault Case: వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయని, దోషులను కఠినంగా శిక్షించాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఆమె స్పష్టం చేశారు. మంత్రి సీతక్క ఈ ఘటనపై వెంటనే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. చిన్నారి ఇంటికి చేరుకుని కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. బాధిత చిన్నారికి తగిన వైద్య, మానసిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికీ తావు ఉండదు. చిన్నారులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
READ MORE: Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!
అసలు ఏం జరిగింది..?
నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్తూ తన నాలుగేళ్ల కుమార్తెను ఇదే గ్రామంలోని తన తల్లివద్ద ఉంచింది. ఈనెల 25న చిన్నారిని అమ్మమ్మ అంగన్‌వాడీ స్కూల్‌లో అప్పగించింది. అంగన్‌వాడీ టీచర్ కుమారుడు (16) తన తల్లి లేని సమయంలో చిన్నారిని పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. అదే రోజు సాయంత్రం కడుపునొప్పి అంటూ చిన్నారి ఇంటికి రాగా అనుమానం వచ్చిన అమ్మమ్మ పరిశీలించగా గాయాలు కన్పించాయి. ప్రస్తుతం చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: 7800mAh బ్యాటరీ, 50MP కెమెరా.. OnePlus Ace 6 ఫోన్‌లో మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్స్ భయ్యో!
