బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి, వారి లాయర్లకు కంగ్రాట్స్. ప్రసిద్ద మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయం. బీఆర్ఎస్ నేత బెయిల్ మీద బయటకు వచ్చారు.. కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం.. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం.. ఈక్విడ్ ప్రో కో నేరంలో పాలు పంచుకున్న భాగస్వామ్యులకు అభినందనలు. విలీనం మాట ముచ్చట పూర్తయింది.. ఇక “అప్పగింతలే” తరువాయి’ అని పేర్కొన్నారు.
Read Also: Modi-Biden telephonic call: పీఎం మోడీ, వైట్ హౌస్ పరస్పర విరుద్ధ ప్రకటన..
బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘ మీరు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై మీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు!!. మీ స్థానానికి చాలా అనుకూలమైనది. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గుర్తించి కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించవలసిందిగా నేను గౌరవపూర్వకంగా కోరుతున్నాను’. అని కేటీఆర్ తెలిపారు.
Read Also: Mohanlal : హేమ కమిటీ కలకలం.. మోహన్ లాల్ సంచలన నిర్ణయం