Site icon NTV Telugu

War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య “వార్”.. ఇది ముగింపు కాదంటూ తారక్ ట్వీట్..!

War21

War21

War 2 : జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్‌ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు హీరోలు సరదాగా గొడవ పడుతూ చేస్తున్న వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

READ MORE: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

తాజాగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌ ఇంటికి ఓ పోస్టర్‌తో కూడిన వాహనాన్ని పంపిన విషయం తెలిసిందే. దానికి బదులుగా హృతిక్ రోషన్‌ ఎన్టీఆర్‌కి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కూడా ఓ పోస్టర్‌తో కూడిన వాహనాన్ని ఎన్టీఆర్‌ ఇంటికి పంపించాడు. దీనిపై స్పందించిన తారక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బాల్కనీలో నిలబడిన ఫొటోను షేర్ చేస్తూ.. “మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు హృతిక్ సార్.. కానీ ఇది ముగింపు కాదు! ఆగస్టు 14న యుద్ధం నిజంగా ప్రారంభమవుతుంది. అప్పుడు కలుద్దాం.” అంటూ రాసుకొచ్చారు. ఎన్టీఆర్ పంపిన వాహనం బిల్ బోర్డుపై..”ఘుంగ్‌రూ టూట్ జాయేంగే పర్ హమ్సే యే వార్ జీత్ నహీ పాయోగే” (మీ కాళ్లు నొప్పి పెట్టినా కూడా మీరు మాతో జరిగే యుద్ధంలో గెలవలేరు )అని రాసి ఉంది. అయితే.. హృతిక్ పంపిన వాహనంపై Naatu Naatu As Much Has You Want But I am Winning This War( నాటు నాటు పాటలో మాదిరిగా ఎంతైనా ఎగురు.. కానీ ఈ “వార్‌”లో గెలిచేది మాత్రం నేనే) అని రాశారు.

Exit mobile version