Site icon NTV Telugu

Asia Cup 2023: ఆసియా కప్ ముందు శ్రీలంకకు వరుస షాక్స్..

Srilanka

Srilanka

మరి కొన్ని గంటల్లో ఆసియా కప్‌-2023కు ముందు శ్రీలంక జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఆ జట్టులోని స్టార్‌ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్‌ కారణంగా ఒక్కొక్కరుగా టీమ్ కు దూరమవుతున్నారు. తాజాగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న హసరంగ పూర్తి కోలుకోకపోవడంతో శ్రీలంక బోర్డు అతన్ని టీమ్ నుంచి పక్కకు తప్పించింది.

Read Also: KA Paul: విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్

వనిందు హసరంగకు ముందు దిల్షన్‌ మధుష్క, లహీరు కుమార, దుష్కంత చమీరా కూడా గాయాలు కావడంతో ఆసియా కప్‌కు దూరమయ్యారు. కాగా, మరో ప్లేయర్ కోవిడ్‌ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆవిష్క ఫెర్నాండో కోవిడ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఐదుగురిని లంక సెలెక్టర్లు తొలుత ఆసియాకప్‌ కోసం ఎంపిక చేశారు.. అయితే గాయాలు, కోవిడ్‌ కారణంగా వీరు జట్టుకు దూరం కావడంతో.. ప్రత్యామ్నాయ ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో లంక తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పోటీ పడుతుంది.

Read Also: Chandrayaan-3: 7 రోజులుగా జాబిల్లిపై చంద్రయాన్-3 ఏమి చేసింది?

బంగ్లా-శ్రీలంక మధ్య మ్యాచ్‌ ఆగస్ట్‌ 31న పల్లెకెలె వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ రేపటి (ఆగస్ట్‌ 30న) నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్తాన్‌-నేపాల్‌ మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 2న భారత్‌-పాక్‌లు పల్లెకెలెలో పోటీ పడబోతున్నాయి. సెప్టెంబర్‌ 4న భారత్‌-నేపాల్‌, సెప్టెంబర్‌ 5న శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే, సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్ తో ఆసియా కప్‌ ముగియనుంది.

Exit mobile version