Site icon NTV Telugu

Student Died: అమెరికాలో వనపర్తికి చెందిన విద్యార్థి మృతి!

Head Constable Died

Head Constable Died

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రూమ్‌లో నిద్రపోయిన అతడు.. నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కొందరు అమెరికాలో చనిపోయారు.

Also Read: Rohit vs Hardik: ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయా?.. యువరాజ్‌ ఏమన్నాడంటే!

వనపర్తి పట్టణం 26వ వార్డుకు చెందిన గట్టు వెంకన్న కుమారుడు దినేష్. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన దినేష్.. ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. శనివారం రూమ్‌లో నిద్రిస్తున్న దినేష్.. నిద్రలోనే మృతి చెందాడు. దాంతో దినేష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దినేష్ భౌతికకాయాన్ని అమెరికా తరలించేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. దినేష్‌తో పాటు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందినట్లు చెప్పారు.

Exit mobile version