ఓటీటీ లు అందుబాటులోకి రావటంతో వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది.. గతం లో ఎక్కువగా హిందీ లోనే వచ్చే ఈ వెబ్ సిరీస్ లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా తెరకెక్కుతున్నాయి.తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంటే, స్టార్ హీరోలు కూడా వీటిలో నటించేందుకు ఎంతాగానో ఆసక్తి చూపిస్తున్నారు. కుమారి శ్రీమతి, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్ మరియు రెక్కీ, లేటెస్ట్‌గా దూత వెబ్ సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ‘వ్యూహం’ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్ మరియు శశాంక్ సిద్దంశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సిరీస్ కు శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న వ్యూహం సిరీస్ డిసెంబర్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోమవారం (డిసెంబర్ 11) అధికారికంగా ప్రకటించారు మేకర్స్.ఇక వ్యూహం వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. న్యాయం కోసం అతను చేసే పోరాటం, ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు వంటి ఆసక్తికర అంశాలతో వ్యూహం వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. కాగా నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ 240 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది.. దూత సిరీస్ లాగానే వ్యూహం వెబ్ సిరీస్ లో కూడా ప్రేక్షకులు ఊహించని మలుపులు ఉంటాయని మేకర్స్ వెల్లడించారు. మరి వ్యూహం వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి..