Site icon NTV Telugu

V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

Vv Vinayak

Vv Vinayak

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితలుగా తిరుగులేని ముద్ర వేసిన పరుచూరి బ్రదర్స్‌పై ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అందరూ వారిని గౌరవిస్తూ, పరిశ్రమకు ఎంతో సేవ చేశారని చెబుతుంటారు. కానీ వినాయక్ మాత్రం వారి వృత్తిపరమైన నిబద్ధత (Professionalism) గురించి మాట్లాడుతూ కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టారు.వినాయక్ కెరీర్ ప్రారంభంలో పరుచూరి బ్రదర్స్‌తో కలిసి అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేశారు.కానీ

Also Read : Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..

“డబ్బులు ఇస్తేనే మేము పని చేస్తాం” అని వారు ఖరాఖండిగా చెప్పే వారని, అలాగే దాదాపు 200 సినిమాలకు వారు పనిచేసినప్పటికీ, క్రెడిట్ విషయంలో ఉన్న కొన్ని కారణాల వల్ల కనీసం టైటిల్స్ లో వారి పేర్లు కూడా పడలేదని వినాయక్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వారి మధ్య ఉన్న అనుబంధం గురించి చెబుతూనే, రెమ్యూనరేషన్ విషయంలో వారు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో వినాయక్ వివరించారు. ఈ ‘బిగ్ రివీల్’ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొందరు వినాయక్ ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు పరుచూరి బ్రదర్స్ లాంటి సీనియర్ల గురించి ఇలా మాట్లాడటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఇంటర్వ్యూలో వినాయక్ ఇంకా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని షూటింగ్ అనుభవాలు, పారితోషికాల విషయంలో వచ్చిన మనస్పర్థల గురించి కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Exit mobile version